డోన్: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి మేలు: బేతంచర్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మట్టా రాజేష్
Dhone, Nandyal | Sep 12, 2026 వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మట్టా రాజేశ్ సూచించారు. బేతంచెర్ల మండలం రంగాపురంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని దాతలు దారా మోహన్, మురళీ మోహన్ సహకారంతో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.