దాహేగం మండలం పీకల గుండం గ్రామంలో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. బురద మాయంగా మారిన రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు మాత్రం పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామంలో రోడ్ల సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు,