ప్రత్తిపాడు: కాకినాడ: ప్రత్తిపాడు మండలంలో భారీ వర్షం, ఇబ్బందుల్లో ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.