ఆళ్లగడ్డ: అహోబిలం పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం గ్రామంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆళ్లగడ్డ డి.ఎస్.పి రవికుమార్ పరిశీలించారు ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన భద్రత చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్ వెంట ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై రామ్మోహన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు