కందుకూరులో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు వినూత్న మార్గాలు ఎంచుకుంటున్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న గుండంకట్ట చెరువుకు తూర్పు వైపున మున్సిపాలిటీ CC రోడ్డు ఉంది. రోడ్డు మార్జిన్కు ఆనుకుని ఉన్న స్థలంలో కబ్జాదారులు యథేచ్ఛగా నీటి బోర్లు వేశారు. దీంతో రోడ్డుపై బురద నీరు చేరి రాకపోకలకు అసౌకర్యంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.