గద్వాల్: KNRUHS వెబ్సెట్లో మార్పు చేయాలి:రాష్ట్ర యూత్ కార్యదర్శి విజయ్ కుమార్
కాళోజీ నారాయణరావు వైద్య విద్య యూనివర్సిటీ వెబ్సైట్లో మార్పు చేసి రాష్ట్ర సరిహద్దు జిల్లాల విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ గద్వాల నాయకుడు రాష్ట్ర యూత్ కార్యదర్శి డాక్టర్ కుర్వ విజయ్ కుమార్ పేర్కొన్నారు. అయిజ కవిత, లక్ష్మి అనే విద్యార్థినిలు ఇంటర్ కర్నూల్లో చదువుకున్నందున నాన్ లోకల్ గా పరిగణించారని, వారు తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నారని తెలిపారు. విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.