కాకినాడ రూరల్: కాజులూరు మండలం కోలంకలో భారీ అగ్నిప్రమాదం: రైస్ మిల్లు, పీచు ఫ్యాక్టరీ దగ్ధం
కాజులూరు మండలం కోలంకలో మాజీ ఎంపీటీసీకి చెందిన రైస్ మిల్లు, పీచు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. 500 ధాన్యం బస్తాలు, 1,300 పీచు బేళ్లు సహా భారీగా ఆస్తినష్టం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం.