గద్వాల్: జీవో నెం.97 రద్దు చేయాలి: పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన
జీవో నెం.97ను రద్దు చేయాలని మరియు పాలిటెక్నిక్ విద్యను, ECET లేటరల్ ఎంట్రీ అవకాశాలను కాపాడాలని కోరుతూ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో PDSU ఆందోళన చేపట్టింది. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానించడంపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.