చిల్పూర్: శ్రీపతిపల్లిలో సీపీఎంలో చేరిన రైతులు, యువత: ఎర్రజెండానే కష్టజీవుల అండ అన్నారు అబ్బాస్
శ్రీపతిపల్లి గ్రామంలో పెద్ద సంఖ్యలో రైతులు, యువత, కార్మికులు సీపీఎంలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కష్టజీవుల రాజ్యం ఎర్రజెండాకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.