నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో జర్నలిస్టుల నిరసన: డీపీఆర్వో తీరుపై ఆగ్రహం
నాగర్కర్నూల్లో అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్న డీపీఆర్వో తీరుపై టీయూడబ్ల్యూజే (ఐజేయు) నిరసన తెలిపింది. జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి, సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.