సంతనూతలపాడు: చీమకుర్తి మండలం రామతీర్థం గంగమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 110 అడుగుల భారీ ప్రభ ఏర్పాటు
చీమకుర్తి మండలం రామతీర్థం లో ఏప్రిల్ 1న శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ల జరగనుంది. తిరుణాల సందర్భంగా ఇప్పటికే టిడిపి, వైసిపి పార్టీలు 110 అడుగుల భారీ ప్రభలను ఏర్పాటు చేయగా, తాజాగా జనసేన పార్టీ కూడా 110 అడుగుల భారీ ప్రభను ఏర్పాటు చేస్తుంది. జనసేన పార్టీ ఏర్పాటుచేసిన భారీ ప్రభను ఊరేగింపుగా రామతీర్థంకు తరలించారు. ప్రభుత్వ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఊరేగింపు కార్యక్రమానికి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు.