ఆళ్లగడ్డ: గోవుల యజమానులు రోడ్లపైకి వదలకుండా సంరక్షించాలని ఆళ్లగడ్డలో జంతు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నిరసన దీక్ష
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో గోవుల యజమానులు రోడ్ల పైన వదలకుండా ఇళ్ల వద్దనే గోవులను సంరక్షించాలని జంతు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు వీపన గండ్ల శ్రీనివాసులు ఆదివారం విజ్ఞప్తి చేశారు, స్థానిక ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు, గోవులను రోడ్ల మీదకు వదలడంతో అవి ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయన్నారు, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని కోరారు