పలమనేరు: వి.కోట: దానమయ్యగారి పల్లెలో మాజీ ఎంపీటీసీ ఇంట్లో 1/2 కేజీ బంగారు, 7కేజీల వెండి, ఆరు లక్షల నగదు చోరీ
వి.కోట: మండలం పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.దానమయ్య గారిపల్లెలో మాజీ ఎంపీటీసీ బాబు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు దోపిడీ చేశారన్నారు. ఇంటి డోర్ ను పగలగొట్టి సుమారు 520 గ్రాముల బంగారం, 7కేజీల వెండి, రూ.6.20లక్షల నగదు అపహరించినట్లు సమాచారం వచ్చిందన్నారు. మొత్తం సొత్తు విలువ సుమారు రూ. 70లక్షలు ఉంటుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ఘటన ప్రజల్లో చర్చనీయంశమైంది.