గుంతకల్లు: పెద్దవడుగూరు మండలం క్రిష్టపాడు శివారులో బైక్ ను ఢీ కొన్న కారు, వ్యక్తికి తీవ్ర గాయాలు, గుత్తి ఆసుపత్రికి తరలింపు
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టపాడు గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో నాగప్రసాద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. యాడికి మండలం రాయలచెరువుకి చెందిన నాగప్రసాద్ పని నిమిత్తం ద్విచక్రవాహనంలో గుత్తికి వస్తుండగా క్రిష్టపాడు శివారులో పెట్రోల్ బంక్ దగ్గర కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో బైక్ నుంచి ఎగిరి రోడ్డుపై పడి నాగప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.