ఇల్లంతకుంట: అతివేగంగా డివైడర్ను ఢీకొట్టిన కారు.. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యం...
అతివేగంగా డివైడర్ను ఢీకొట్టిన కారు.. సిసి ఫుటేజ్ వైరల్..కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. హైదరాబాదు నుండి కరీంనగర్ కు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను డికోట్టి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పక్కన ఉన్న బారికేడ్లను ఢీ కొట్టుకుంటూ వెళ్లి ఆగిపోయింది. కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన అక్కడున్న CC కెమెరాల్లో రికార్డయింది. ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.