విశాఖపట్నం: మాజీ జీఎస్టీ కమిషనర్ ఆనంద కుమార్ పై దాడి: నిందితులను శిక్షించాలని దళిత సంఘాల డిమాండ్
మాజీ జీఎస్టీ కమిషనర్ పులపాక ఆనంద కుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని మరియు ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి, ఉన్నత స్థాయి విచారణ జరపాలని వారు కోరారు.