రాప్తాడు: హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల్లో 3850 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు మంగళవారం 12 25 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం నుంచి చిత్తూరు జిల్లా వరకు హంద్రీనీవా లైనింగ్ పనులలో 3850 కోట్ల రూపాయలు అవినీతి చేయడం జరిగిందన్నారు అయితే ఆరు నెలల్లోనే ఏ విధంగా ఈ పనులు పూర్తి చేశారో ప్రజా ప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాలని,అదేవిధంగా 52 టీఎంసీ నీళ్లు జిల్లాలు ఎక్కడ కేటాయించారు కూడా అధికారులు సమాధానం చెప్పాలని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.