గుంతకల్లు: గుత్తిలో ఇంటి పట్టాలివ్వాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన నిరుపేద మాదిగలకు ఇంటి పట్టాలి ఇచ్చి గృహాలు మంజూరు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గుత్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ ప్రసాద్ మాట్లాడుతూ గుత్తి పట్టణంలో సర్వే నంబర్ 547, 565 లలో సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అక్కడ అర్హులైన వారికి పట్టాలిచ్చి సొంతిల్లు నిర్మించి ఇవ్వాలని తహసీల్దార్ పుణ్యవతికి వినతి పత్రం అందజేశారు.