నర్సీపట్నం: నర్సీపట్నం కోర్టు పేరుతో ఫేక్ బెయిల్ పత్రాలు: కేసు నమోదు
నర్సీపట్నం అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు పేరుతో నకిలీ బెయిల్ పత్రాలను సృష్టించిన ఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, నిందితుల గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.