నర్సంపేట: నర్సంపేట ట్రెజరీలో లంచం ఆరోపణలు: ఏటీవో, ఉద్యోగిపై బదిలీ వేటు
వరంగల్ జిల్లా నర్సంపేట ట్రెజరీ కార్యాలయంలో లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఏటీవో చంద్రకళ, ఉద్యోగి ఆలేఖ్యలపై చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వారిద్దరినీ కరీంనగర్ మరియు కొత్తగూడెంకు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.