ధర్మపురి: ధర్మపురిలో రూ. 18 కోట్ల అభివృద్ధి పనులు: నాణ్యతతో పూర్తి చేయాలని బీజేపీ డిమాండ్
ధర్మపురిలో జల్ జీవన్ అమృత పథకం కింద చేపట్టిన రూ. 18 కోట్ల అభివృద్ధి పనులను బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా వేగంగా పూర్తి చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ మరియు నాయకులు అధికారులను కోరారు.