గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో భారీ వాహనాల రాకపోకల వల్ల ట్రాఫిక్కు అంతరాయం తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు, వాహన దారులు
గిద్దలూరు పట్టణంలో భారీ వాహనాల రాక వల్ల ట్రాఫిక్ కు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వాహనదారులతో పాటు ప్రజలు అంటున్నారు. సోమవారం గాంధీ బొమ్మ సెంటర్లో భారీ కంటైనర్ మరియు లారీ రావడం వల్ల చాలా సేపు వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. పట్టణంలో పెరిగిన భారీ వాహనాల రాకతో ఇలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్డు వెడల్పు లేకపోవడం పట్టణంలో కూడా అధికంగా వాహనాల రాకపోకలు పెరగడం ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.