గిద్దలూరు: ఎంతో మహిమ కలిగిన రంగనాయక స్వామిని దర్శించుకోవాలన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
రాచర్ల మండలంలోని ఎంతో మహిమ కలిగిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారిని భక్తులు దర్శించుకోవాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో ఆలయంపై డాక్యుమెంటరీ తీశారు. ఆలయ విశిష్టత ప్రకృతి అందాలను ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.