డోన్: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి ఆరు రోజులు జైలు శిక్ష
Dhone, Nandyal | Nov 12, 2026 డోన్ పట్టణంలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించింది. డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రంకెన్ డ్రైవ్ కేసులో నిందితుడు నాదెండ్ల నారాయణ (37)కు గౌరవనీయ స్పెషల్ జుడీషియల్-II క్లాస్ మేజిస్ట్రేట్ నూరుల్లా ఈ శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.