ధర్మారం: ఆదర్శ పాఠశాల లో ఘనంగా హిందీ భాష దినోత్సవ వేడుకలు...
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో హిందీ భాష దినోత్సవ వేడుకలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు హింది బాష యొక్క విశిష్టతను వివరించారు.నేటి విద్యార్థులకు హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా విద్యార్థులు చేసిన టీఎల్ఎం ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. దేశ భవిష్యత్తులో హిందీ ద్వారా పొందు ఉద్యోగ ప్రయోజనాలను విద్యార్థులందరికీ హిందీ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న హిందీ భాష దినోత్సవం జరుపుకుంటామని,భారత జాతీయోద్యమ సమయం లో అఖిల భారత ప్రజానికాన్ని ఏకం చేసిందన్నారు.