మోత్కూర్: మోత్కూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు కోసం అఖిలపక్షం నిర్ణయం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రయాణ ఇబ్బందులను పరిష్కరించేందుకు, ప్రాంతాభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి డిపో కోసం కృషి చేస్తామని నాయకులు ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.