కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పక్షులకు జీవరాశులకు పోలీస్ స్టేషన్ ఆవరణలో నీటి తోట్లు ఏర్పాటుచేసిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పక్షులకు చిన్నపాటి జీవరాసులకు నీటి తోటలను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలలో చిన్నచిన్న మట్టితోట్లలో నీటిని నింపి పక్షులకు చిన్నప్పటి జంతువుల కోసం అందుబాటులో ఉంచారు. వేసవికాలంలో పక్షులకు మరియు చిన్నచిన్న జీవరాసులు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటాయని ఈ నేపథ్యంలో వాటిని సంరక్షించేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు నీటితో ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. జీవరాసులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని ఎస్పీ పోలీసులకు తెలిపారు.