వనపర్తి: వనపర్తి జనరల్ ఆసుపత్రిలో ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జనరల్ ఆసుపత్రిలో నర్సింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మానసిక ఒత్తిడిని గుర్తించడం, ఇతరులకు అండగా నిలవడం గురించి వివరించారు. సహాయం కోసం 14416 టెలి-మానస్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు.