జగిత్యాల రూరల్: అంతర్గాం గ్రామంలో కొత్త అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో నూతన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామంలో 12 కోట్ల రూపాయలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.