దివ్యాంగులు, వయవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి శనివారం వెలగపూడి సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరన్ క్యాంపులు నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పీఎం జేఏవై వందన స్కీం ద్వారా రూ. ఐదు లక్షల ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు