కావలి పట్టణంలోని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల ఎదురుగా ఉన్న దుకాణాలను మున్సిపల్ అధికారులు గురువారం తొలగించారు. ఈ దుకాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తున్నామన్నారు. గత 15 రోజులుగా చెప్పినా వ్యాపారులు పట్టించుకోకపోవడంతో క్రేన్ సహాయంతో తొలగించామని సిబ్బంది తెలిపారు. అధికారుల చర్యలపై చిరు వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.