పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.