అదిలాబాద్ అర్బన్: సాంగిడిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు కొత్త శాఖ ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన శాఖను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రుణాల రీషెడ్యూల్కు చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.