ఆమదాలవలస: శ్రీకాకుళం: ఆమదాలవలసలో రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. స్కూల్ జంక్షన్ వద్ద లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ లారీని ఆపకుండా పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.