పెందుర్తి: సుజాతనగర్ మద్యం షాపుపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరిక
విశాఖ సుజాతనగర్ 80 ఫీట్ల రోడ్డులోని మద్యం షాపును వారం రోజుల్లో తొలగించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. స్థానికుల నిరసనకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఆయన, అధికారులు స్పందించకుంటే తానే స్వయంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.