గంగాధర నెల్లూరు: జీడీ నెల్లూరులో అక్రమ ఇసుక దందా: 4 ట్రాక్టర్లు సీజ్
జీడీ నెల్లూరు నీవానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలపై తహశీల్దార్ శ్రీనివాసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 10 ట్రాక్టర్లను గుర్తించగా, 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇకపై ఇలాంటి పనులకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.