చివ్వెంల: చివ్వెంలలో గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు: 8 మంది అరెస్ట్
సూర్యాపేట జిల్లా చివ్వెంల ఉండ్రుగొండ ఆలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మెటల్ డిటెక్టర్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.