కురుపాం: 50 ఏళ్లుగా పూర్తికాని జంజావతి ప్రాజెక్టు: 50 రోజులకు చేరుకున్న రైతుల దీక్షలు
పార్వతీపురం మన్యం జిల్లాలో జంజావతి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షలు 50 రోజులు పూర్తి చేసుకున్నాయి. కొమరాడ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన సాధన సమితి సభ్యులు, బుధవారం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.