వికారాబాద్: ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం: అర్హులు ఇలా నమోదు చేసుకోండి
వికారాబాద్ జిల్లా గొట్టిముక్కల గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 నుండి 59 ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులని, ఎటువంటి ప్రీమియం లేకుండా 5 లక్షల భీమా లభిస్తుందని సర్పంచ్ తెలిపారు. అర్హులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలని కోరారు.