గద్వాల్: గంజాయి సాగుపై చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలింపు: సీఐ శ్రీను
గద్వాల జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.గట్టు మండలంలోని బోయల గూడెం గ్రామ శివారులోని పొలంలో మిరప, పత్తి పంటల మధ్యలో గంజాయి సాగు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు గట్టు ఎస్ఐ, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయత్ సెక్రటరీతో కలిసి తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తొమ్మిది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు బస్వాపురం ప్రాణేష్, వయస్సు 21 సంవత్సరాలు, తోతినోనిదొడ్డి గ్రామానికి చెందిన రైతు గుర్తించారని సిఐ శీను గురువారం సాయంత్రం తెలిపారు..