అమలాపురం: కోనసీమ జిల్లాలో ప్రాజెక్ట్ సంజీవని: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక డిజిటల్ వైద్య సేవలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 'ప్రాజెక్ట్ సంజీవని' ప్రారంభం. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఒకే డిజిటల్ వేదికపైకి రానున్నాయి. ఆభా ఐడీ అనుసంధానం, వర్చువల్ కన్సల్టేషన్ మరియు 104, 15537 నెంబర్ల ద్వారా అపాయింట్మెంట్లు వంటి సౌకర్యాలతో ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.