ఎల్కతుర్తి: వల్భాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో భారీ నాగుపాము: భయాందోళనలో విద్యార్థులు
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టుపై భారీ నాగుపాము కనిపించింది. క్రికెట్ ఆడుతున్న పిల్లలు పామును చూసి భయపడి పరుగులు తీశారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రత పాటించాలని స్థానికులు కోరుతున్నారు.