బనగానపల్లె: బనగానపల్లె లో 124 అడుగుల ఎత్తుకుల సాయిబాబా విగ్రహం
బనగానపల్లె మండలంలోని యాగంటి పల్లె వెళ్లే రహదారిలో సద్గురు సాయిబాబా 124 అడుగుల ఎత్తు గల విగ్రహాన్ని గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. యాగంటి వెళ్లే భక్తులు కచ్చితంగా సాయిబాబా విగ్రహాన్ని సందర్శించి వెళ్తుంటారు. సద్గురు సాయిని దర్శించుకొని సాయికోటి మహాస్తూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అజ్ఞానపు సందేహాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రతి గురువారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు