ఏటూరునాగారం: అటవీ సంపద రక్షణకు అధికారుల సమన్వయం: జిల్లా కలెక్టర్ ఆదేశాలు
జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూముల ఆక్రమణ, కలప అక్రమ రవాణాపై రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.