సూర్యాపేట: సూర్యాపేట మార్కెట్ రోడ్డులో ఆయిల్ ట్యాంకర్ దగ్ధం: భారీగా ఎగిసిపడిన మంటలు
సూర్యాపేట కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డులో ఆయిల్ ట్యాంకర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.