కరీంనగర్: సుడా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు
కరీంనగర్లో సుడా పరిధిలోని అభివృద్ధి పనులపై వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని సూచించారు.