తాడూరు: నాగర్‌కర్నూల్: ఆధునిక పద్ధతులతో పంటల సాగు, సక్సెస్ అవుతున్న రైతులు
నాగర్‌కర్నూల్ జిల్లాలో సాంప్రదాయ పంటలకు బదులుగా ఆధునిక పద్ధతులతో కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సాగు విధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.