మందమర్రి: మంచిర్యాల: 23వ రోజుకు చేరుకున్న ఎంహెచ్ఎం ఉద్యోగుల ఆందోళన
మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఎంహెచ్ఎం ఉద్యోగుల సమ్మె 23వ రోజుకు చేరింది. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు బోనాలతో నిరసన తెలిపారు. రాజకీయ మద్దతు లభిస్తున్నా, సమ్మె వల్ల వైద్య సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.