పాణ్యం: పాణ్యం మండల కేంద్రంలోని డొంగు రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం
పాణ్యం మండల కేంద్రంలోని డొంగు రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు యూ-టర్న్ తీసుకునే ప్రయత్నంలో బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనాలకు నష్టం వాటిల్లగా, స్వల్ప గాయాలు జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.