ఒంగోలు అర్బన్: ఒంగోలులోని మంగమూరులో డ్రైనేజీ కాలువల వల్ల తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు
Ongole Urban, Prakasam | Aug 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మురుగునీరు నిలువ ఉండడం వల్ల తీవ్ర దుర్వాసన వెదజల్లడమే కాకుండా ఈగలు దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే డ్రైనేజీ మురుగునీరు తొలగించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అలానే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. వాహనదారులు కూడా తీవ్ర దుర్వాసన వస్తుందని అంటున్నారు.